మనం..మన ఊరు..మన గేమ్ షో

కిర్రెక్కించే కొత్త గేమ్ షో కొన్ని గేమ్ షో లు టైటిల్ చూడగానే కనెక్ట్ అయిపోతాం. ఆ తర్వాత అందులో కంటెంట్ బాగుంటే కదలకుండా అలా కళ్లప్పగించి టీవికి అతుక్కుపోతాం. ఆ ఏదో చెప్తారు కానీ అలాంటి గేమ్ షో ఏమొచ్చింది ఈ మధ్యన అంటారా..అయితే మీరు అర్జెంటుగా విలేజ్ లో వినోదం గేమ్ షో చూడాల్సిందే. నిన్నటివరకూ పాత పాటలు, కంటెంట్ తో సంగీత ప్రియుల అభిమానాన్ని చూరగొన్న జెమినీ లైఫ్ ఇక నుంచి కొత్త కొత్త పాటలతో ..ఆటలతో..సరి కొత్త సీరియల్స్ తో మన అందరినీ అలరించటానికి మన ముందుకు వస్తోంది. అందులో భాగంగా డిజైన్ చేసిందే విలేజ్ లో వినోదం. పూర్తి గ్రామీణ నేపధ్యంలో సాగే ఈ గేమ్ షో …గ్రామీణ మూలాలున్న మనందరినీ మనకు తెలియకుండానే భాగస్వామ్యం చేసేస్తుందనటంలో సందేహం లేదు. ముఖ్యంగా అంకుల్, ఆంటి, డ్యూడ్, బ్రో అని పిలుచుకునే ఈ ట్రెండ్ ని కొద్దిగా వెనక్కి తీసుకెళ్లి మన అసలు సిసలు తెలుగు అనుబంధాల నేపధ్యంలో బాబయ్య, పిన్ని, మావ, అల్లుడు అంటూ పలకరించుకునే పల్లె జనం దగ్గరకు తీసుకువెళ్లి మనని మనకు గుర్తు చేస్తుందీ గేమ్ షో . ఓ ప్రక్కన సరదా, మరో ప్రక్క జ్ఢాపకాల వరదా మిమ్మల్ని ముంచేస్తాయి. ఇలాంటి పోగ్రాం ఇంతకు ముందు తెలుగు టీవి ప్రపంచంలో మీకు కనపడలేదని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ప్రతీ ఎపిసోడ్ ఆంధ్రా, తెలంగాణాలో ఉన్న మన మూల మూల గ్రామాల్లో ప్లాన్ చేస్తున్నారు. అక్కడకి వెళ్లి అక్కడ మనవారితో మనసు కలిసి, మాట కలిపి, నడక కలిపి, వారి జీవిన విధానంలో కలిసి..వారి నవ్వులు, నాట్యాలు, కేరింతలు, కవ్వింతలు, కబుర్లు, వెటకారాలు, మమకారాలుతో మీ ముందుకు వచ్చేస్తోంది. మీరు చెయ్యాల్సిందల్లా ఆ పోగ్రాం సమయానికి జెమినీ లైఫ్ ఛానెల్ ని ట్యూన్ చెయ్యటమే.